TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సిద్ధూ చిక్కాడు.. జైల్లో!

Published on: Tue Nov 29, 2022 9:34AM

నవజోత్ సింగ్ సిద్ధు.. వెటరన్ క్రికెటర్.. తన కెరీర్ లో సిక్సర్ల సిద్ధూగా గుర్తింపు పొందాడు. ఆ తరువాత క్రికెట్ కామెంటరేటర్ గా అవతారం ఎత్తి తనదైన పంచ్ తో గుర్తింపు పొందాడు. ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేసి పదునైన విమర్శలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు.  అలాంటి సద్ధూ ప్రస్తుతం పటియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

ఎందుకంటే.. 1988లో జరిగిన రోడ్ యాక్సిడెంట్ కేసులో   సిద్ధూకు జైలు శిక్ష ప‌డింది. 34 ఏళ్ల నాటి రోడ్ రేజ్ కేసులో పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఈ ఏడాది మేలో ఏడాది శిక్ష పడింది. అందుకే గత ఆరునెలలుగా సిద్ధూ పటియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే జైలులో సిద్ధు  అత్యంత క్రమశిక్షణతో మెలుగుతున్నాడు. ముఖ్యంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాడని జైలు అదికారులు చెప్పారు.

ఆరు నెలల జైలు జీవితంలో సిద్ధూ 34 కిలోల బరువు తగ్గాడు. రోడ్ యాక్సిడెంట్ కేసులో ఏడాది జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే సిద్ధూ రోజూ నాలుగు గంటల పాటు మెడిటేషన్ చేయడమే కాకుండా, మరో రెండు గంటల పాటు యోగా, వ్యాయామం కూడా చేస్తున్నాడు. అంతే కాకుండా రెండు మూడు గంటలు పుస్తక పఠనానికి కేటాయిస్తున్నాడు.

ఇక నిద్రకు కేవలం నాలుగు గంటల మాత్రమే కేటాయిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. మితాహారంతో ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపుతున్నాడని చెప్పారు. బారాక్ నంబర్ 10లో ఉంటున్న సిద్ధూ మొన్నటి వరకు   పంజాబీ సింగర్ సెలబ్రిటీ దలేర్ మెహందీతో పాటు సెల్ లో ఉన్నాడు. దలేర్ రిలీజ్ కావటంతో ప్రస్తుతం ఆయన మిగతా వారితో పాటు ఉంటున్నాడు.