ఎమ్మెల్సీగా సిద్దిపేట కలెక్టర్.. వెంకట్రామిరెడ్డి రాజీనామా?
Published on: Mon Nov 15, 2021 1:19PM
తెలంగాణలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. వరి ధాన్యం పండించే విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన పదవికి రాజీనామా చేయబోతున్నారని తెలుస్తోంది. సీఎస్ ను కలిసి ఆయన తన ఐఏఎస్ కు రాజీనామా సమర్పిస్తారని చెబుతున్నారు.
వెంకట్రామిరెడ్డి రాజీనామాకు రాజకీయ కారణాలు ఉన్నాయంటున్నారు. ఆయనను ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ నియమించే అవకాశం ఉందంటున్నారు. గవర్నర్ కోటాలో వెంకట్రామిరెడ్డిని నామినేట్ చేస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని ప్రతిపాదిస్తూ గతంలోనేే కేసీఆర్ కేబినెట్ తీర్మానం చేసింది. అయితే కౌశిక్ రెడ్డి ఫైలును గవర్నర్ తమిళి సై పెండింగులో పెట్టారు. దీంతో ఆ పోస్టును వెంకట్రామిరెడ్డికి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని అంటున్నారు.


