TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ యాగంపై కర్నాటక సీఎం కామెంట్స్..

Published on: Wed Dec 30, 2015 10:23AM


కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఏదో ఒక విషయంపై కామెంట్లు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన ఆయుత చండీయాగంపై కూడా విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. కర్నాటక విధాన సౌధలో జరిగిన కవి కువెంపు జయంతి వేడుకల సందర్భంగా హాజరైన సిద్ద రామయ్య కేసీఆర్ యాగం గురించి ప్రస్తావిస్తూ..  తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటూ కేసీఆర్ చండీయాగం చేశారని, హోమాలు చేసినంత మాత్రాన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? ఈ విషయంలో శాస్త్రీయత ఉందా? అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. యాగాలు చేస్తే వర్షాలు కురుస్తాయా? అదే నిజమైతే దేశంలో కరవు ఛాయలే కనిపించేవి కావని, యావత్తు దేశాన్నే సుభిక్షం చేసేవాళ్లమని ఆయన అన్నారు.

కాగా సిద్ద రామయ్య మూఢ నమ్మక వ్యతిరేక బిల్లు పైన కృషి చేస్తున్నారు. తన విషయంలో జ్యోతిష్యులు చెప్పింది ఏదీ నిజం కాలేదని.. టీవీ కార్యక్రమాల్లో జ్యోతిష్య శాస్త్రం తదితరాలను నిషేధించడానికి తానే ఓ నిదర్శనం అని సిద్ధరామయ్య అంటున్నారు. మరి సిద్ద రామయ్య చేసిన కామెంట్స్ కు కేసీఆర్ ఎలా సమాధానం చెబుతారో చూడాలి.