బొటా బొటిగ గెలిచిన సిద్ద రామయ్య...

 

ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదట్లో వెనుకంజలో ఉన్నా.. ఎట్టకేలకు కర్ణాటక ఎన్నికల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజయం సాధించారు. రెండు చోట్ల నుంచి పోటీపడిన సీఎం సిద్ధరామయ్య బదామీలో గెలిచారు. 3వేల ఓట్ల తేడాతో  బీజేపీ అభ్యర్ధి శ్రీరాములుపై బొటా బొటిన గెలిచారు. మరో నియోజకవర్గం చాముండేశ్వరిలో ఓడిపోయారు. మరోవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో భాజపా దూసుకుపోతోంది. దీంతో భాజపా శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో సొంతంగానే ప్రభుత్వాన్ని చేపడతామని భాజపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.