TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మోడీ గారు ముందు మీరు చదవండి... సిద్దు సవాల్...

Published on: Wed May 2, 2018 5:06PM

 

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ప్రధాని నరేంద్ర మోడీ ఓ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. త్వరలో కర్ణాటక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారం కార్యక్రమాల్లో బిజీగా పాల్గొంటున్నాయి.  దీనిలో భాగంగానే  కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లా సంతెమారహళ్లిలో బహిరంగసభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... రాహుల్‌ గాంధీకి ఓ సవాలు విసిరారు.  'హిందీ లేక ఆంగ్లం లేక మీ అమ్మగారి మాతృభాష ఇటాలియన్‌లో 15 నిమిషాలు కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన విజయాలను కాగితం చూడకుండా మాట్లాడండి' అని మోదీ సవాల్ విసిరారు. ఇక ఈ సవాల్ పై రాహుల్ స్పందించలేదు కానీ సీఎం సిద్దరామయ్య తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. కర్ణాటకలో గతంలో యడ్యూరప్ప సర్కారు సాధించినవేంటో 15 నిమిషాలు పేపర్‌లో చూసుకుంటూ అయినా మాట్లాడాలని మోడీకి ప్రతి సవాలు విసిరారు. మరి మోడీ ఈ సవాల్ ను స్వీకరిస్తారో లేదో చూద్దాం..!