TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మోడీ కి సిద్ద కౌంటర్... మీరు అందుకే చేశారా...!

Published on: Tue May 1, 2018 4:31PM

 

ఓటమి భయంతోనే సిద్దరామయ్య కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారని మోడీ సిద్ద రామయ్యపై కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సిద్ద రామయ్య ఆయనకు కౌంటర్ ఇచ్చారు. 2014లో మీరెందుకు రెండు చోట్ల పోటీ చేశారో చెప్పాలంటూ మోదీని సిద్దరామయ్య ప్రశ్నించారు. ఓటమి భయంతోనే నరేంద్ర మోదీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో రెండు (వారణాసి, వడోదర) స్థానాల్లో పోటీచేశారని, ఇప్పుడు అందుకు వివరణ స్వయంగా ఇచ్చుకున్నారని సెటైర్ వేశారు. ప్రధానికి ఓ న్యాయం, సీఎంల విషయానికొస్తే.. అందులోనూ కాంగ్రెస్ నేతలకు మరో న్యాయాన్ని మోదీ వర్తింపచేస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో ఇప్పుడు 2+1 ఫార్ములాతో రాజకీయాలు నడుస్తున్నాయన్న ప్రధాని వ్యాఖ్యలు నిజమేనన్నారు. కానీ ఫార్ములా బీజేపీకి వర్తిస్తుందని, 2 రెడ్డి+ 1యెడ్డీ (యడ్యూరప్ప) దాని సారాంశమంటూ సిద్దరామయ్య కౌంటర్ ఇస్తూ ట్వీట్లు చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.