TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

యోగి పై సిద్దరామయ్య చురకలు..లెక్చర్లు ఇవ్వడం ఆపండి...

Published on: Thu Mar 15, 2018 4:27PM

 

ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇక బీజేపీ ఓటమిపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా.. ఎస్పీ-బీఎస్పీ పొత్తును తక్కువ అంచనా వేశామని, ఓటమిని అంగీకరిస్తున్నామని అన్నారు. ఈ ఉపఎన్నికల ఫలితాలు తమకు ఓ గుణపాఠమని, ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకుంటామని, పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు, జరిగిన పొరపాట్లపై విశ్లేషిస్తామని చెప్పారు. అయితే బీజేపీ ఓటమిపై  కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య కూడా స్పందించి  యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శల వర్షం కురిపించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం నిర్వహించే బీజేపీ ప్రముఖుల్లో యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఉన్న విషయం తెలిసిందే. 'ఒక సీఎం, డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలను బీజేపీ కోల్పోయింది. ఇప్పుడు బీజేపీ తీవ్ర అవమాన భారంతో బాధపడుతోంది. చరిత్రాత్మక విజయం సాధించిన సమాజ్‌వాది పార్టీ బీఎస్పీలకు నా అభినందనలు. బీజేపీయేతర పార్టీల ఐక్యత చాలా కీలక పాత్ర పోషించింది' అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

 

ఇదే సమయంలో యోగి ఆదిత్యనాథ్‌కు కూడా చురకలంటించారు. సీఎం ఆదిత్యనాథ్‌ కర్ణాటక అభివృద్ధిపై ఉపన్యాసాలు ఇవ్వడం తగ్గించుకుంటే ఆయనకే మంచిదంటూ చురకలంటించారు.