TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పారిశ్రామికవేత్త శ్యాంప్రసాద్ రెడ్డిపై సిబిఐ దృష్టి

Published on: Thu May 17, 2012 4:29PM

వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ అధికారులు మరో పారిశ్రామికవేత్తపై దృష్టి సారించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అనూహ్యంగా పెరిగిన శ్యాంప్రసాద్ రెడ్డిపై సిబిఐ ప్రత్యేక కన్ను వేసినట్లు చెబుతున్నారు. ఇందు ప్రాజెక్ట్స్ చైర్మన్ అయిన ఇందుకూరి శ్యాంప్రసాద్ రెడ్డి రియల్ ఎస్టేట్ రంగంలో కాలు పెట్టిం అతి కొద్ది కాలంలోని ఇందు ప్రాజెక్ట్స్ 2 వేల కోట్ల టర్నోవర్ సాధించడమే సిబిఐ అనుమానాలకు కారణమని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందు ప్రాజెక్ట్స్ యేటా వంద శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది.

 

 

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ వెంచర్స్ కోసం శ్యాంప్రసాద్ రెడ్డి భూములు పొందినట్లు చెబుతారు. ఇందు ఫార్చునిస్ ఫీల్డ్స్, ఇందు అరణ్య, ఇందు సిటీ వంటి ప్రాజెక్టులను హైదరాబాదులోని, హైదరాబాదు పరిసరాల్లోనూ చేపట్టారు. లేపాక్షి నాలెడ్జి హబ్ విషయంలో శ్యాంప్రసాద్ రెడ్డి నిబంధనలను ఉల్లంఘించి, ఆ భూమి మీద 790 కోట్ల రూపాయల రుణాలు పొందారనే ఆరోపణలున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం. ఇందు ప్రాజెక్ట్స్‌కు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని ఎపిఐఐసి ఇప్పటికే ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. శ్యాంప్రసాద్ రెడ్డిని సిబిఐ అధికారులు ఇప్పటికే ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి.