TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శృతిని భయపెట్టిన అపరిచితుడు

Published on: Wed Nov 20, 2013 9:37AM

 

హీరోయిన్ శృతిహాసన్‌ కు ఓ అపరిచితుడు భయపెట్టేసాడు. మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ముంబైలోని ఆమె ఇంటికి ఓ అపరిచితుడు వచ్చి డోర్ కొట్టగానే, శృతి వెంటనే డోర్ తెరిచింది. వెంటనే ఆ అపరిచితుడు లోపలికి వచ్చి, శృతి మెడను పట్టుకోవడంతో ఏం చేయాలో, ఏం జరుగుతుందో తెలియక భయపడుతున్న శృతి, కాస్త ధైర్యం చేసి, ఆ వ్యక్తిని గట్టిగా తోసేసింది. దాంతో ఆ అపరిచితుడు కూడా అక్కడి నుండి వెంటనే పారిపోయాడు. అయితే అతడిని తాను ఇప్పటివరకు చూడలేదని. అసలు అతనెవరో? ఎందుకు వచ్చాడో కూడా తెలియక పెద్ద షాక్ లో ఉంది.