సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో షాకింగ్ విషయాలు
posted on Jul 27, 2025 5:30PM

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. తన వద్దకు వచ్చిన దంపతులకు ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టలేరని, సరోగసితో పిల్లలు పుడతారని నమ్మించారు. సరోగసితో కోసం వేరే దంపతులకు రూ. 5లక్షలు ఇవ్వాలని చెప్పారు. ఈ కేసులో అసలు సరోగసి జరగలేదు. ఎవరికో పుట్టిన బిడ్డను దంపతులకు అప్పగించారు. బిడ్డకు డీఎన్‌ఏ టెస్ట్ చేయడంతో అసలు విషయం తెలిసిందని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు.
ఒక జంట 2024 ఆగస్టులో సంతాన సాఫల్యం కోసం యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను సంప్రదించారని వెల్లడించారు. డా. నమ్రత వారికి సరోగసీ చేయించుకోవాలని సూచించారని తెలిపారు. ఆ క్లినిక్ ద్వారా సరోగసీ తల్లిని ఏర్పాటు చేస్తామని నమ్మించారని అన్నారు. తొమ్మిది నెలల పాటు ఆ జంట క్లినిక్‌కు డబ్బులు చెల్లించారని గుర్తుచేశారు. 2025 జూన్‌లో సరోగసీ తల్లికి విశాఖపట్నంలో అబ్బాయి పుట్టాడని, డెలివరీ ఛార్జీలు చెల్లించి బిడ్డను తీసుకెళ్లాలని వారికి సమాచారం అందించారని చెప్పుకొచ్చారు. బిడ్డను అప్పగించి, తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి, తప్పుడు డీఎన్ఏ సృష్టించారని అన్నారు.
ఆ తర్వాత భార్యభర్తల వీర్యం, అండంతో బిడ్డ వారికి పుట్టినట్లుగా నమ్మించారని తెలిపారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆ జంట నుంచి మొత్తం రూ. 35 లక్షలకు పైగా వసూలు చేసిందని తెలిపారు. తర్వాత, ఆ జంట డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోగా, బిడ్డ డీఎన్‌ఏ వారికి అసలు సరిపోలేదని తేలిందని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు. మరోవైపు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.