TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫ‌స్ట్ టెస్ట్‌లోనే సెంచ‌రీ.. శ్రేయస్ అయ్యర్ అదుర్స్‌...

Published on: Fri Nov 26, 2021 10:23AM

105 ర‌న్స్‌ (171 బంతుల్లో 13X4, 2X6). ఇదేమీ వ‌న్డే ప‌ర్‌ఫార్మెన్స్ కాదు. వ‌న్డేలా ఆడిన టెస్ట్ మ్యాచ్ స్కోర్‌. టీ20 స్పెష‌లిస్ట్ బ్యాట్స్‌మెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో సాధించిన స్కోరు. టెస్ట్ మ్యాచ్‌ అరంగేట్రంతోనే సెంచ‌రీ చేసి వండ‌ర్ చేశాడు శ్రేయ‌స్‌. తనదైన బ్యాటింగ్‌ స్టైల్‎తో ఇర‌గ‌దీశాడు అయ్యర్‌. 157 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ కంప్లీట్ చేశాడు. 

తొలి రోజు జడేజా (50)తో కలిసి శ్రేయస్‌ (75) ఐదో వికెట్‌కు సెంచ‌రీ భాగస్వామ్యం నెలకొల్పాడు. టీంఇండియా 258/4 స్కోర్‌తో మంచి స్థితిలో నిలిచింది. రెండో రోజు బ్యాటింగ్‌ ఆరంభించగా ఆదిలోనే జడ్డూ ఔటయ్యాడు. ఫోర్లతో విరుచుకుపడిన శ్రేయస్‌ టెస్టుల్లో తొలి మూడంకెల స్కోర్‌ అందుకున్నాడు. 91.1 ఓవర్‎లో సౌథీ బౌలింగ్‎లో రెండు రన్స్ తీసి తొలి టెస్టు సెంచ‌రీ సాధించాడు. 

అనంతరం సౌథీ బౌలింగ్‌లో విల్‌యంగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా, టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం టెస్టులోనే శతకం సాధించిన 16వ బ్యాట్స్‌మన్‌గా, న్యూజిలాండ్‌పై తొలి టెస్టులో ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు శ్రేయ‌స్ అయ్య‌ర్‌.