TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

565 కేజీల బరువు ఎత్తి సంచలనం: శ్రేణిక్ సాధించిన అద్భుత రజత విజయం!

Published on: Fri Jul 17, 2026 10:36AM

పట్టుదల, క్రమశిక్షణతో కూడిన నిరంతర శ్రమ ఉంటే ఆకాశమే హద్దుగా రాణించవచ్చని నిరూపించారు హైదరాబాద్‌కు చెందిన పవర్‌లిఫ్టర్ మారుపాక శ్రేణిక్. అంతర్జాతీయ వేదికపై మన దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేస్తూ ఆయన అద్భుత విజయాన్ని అందుకున్నారు. సౌతాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రూమ్‌ నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 'ఆసియా ఆఫ్రికన్‌ పసిఫిక్‌ క్లాసిక్‌, ఎక్విప్డ్‌ పవర్‌ లిఫ్టింగ్‌ అండ్‌ బెంచ్‌ ప్రెస్‌ చాంపియన్‌షిప్‌'లో శ్రేణిక్ రజత పతకం (సిల్వర్ మెడల్) సాధించి సంచలనం సృష్టించారు.

డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విద్యాసంస్థల్లో లెక్చరర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, పవర్‌లిఫ్టింగ్‌పై తనకున్న మక్కువతో శ్రేణిక్ ఈ ఘనత సాధించడం విశేషం. ఈ టోర్నీలో 74 కేజీల ఓపెన్ సీనియర్ విభాగంలో పోటీపడిన ఆయన.. ఏకంగా 565 కేజీల భారీ బరువును ఎత్తి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ, ఏమాత్రం వెనకడుగు వేయకుండా శ్రేణిక్ ప్రదర్శించిన స్థైర్యం అందరినీ ఆకట్టుకుంది. ఆయన సాధించిన ఈ సిల్వర్ మెడల్ ఏళ్ల తరబడి పడిన కష్టానికి, తిరుగులేని పట్టుదలకు దక్కిన ప్రతిఫలమని అంబేద్కర్ విద్యాసంస్థల ప్రతినిధులు కొనియాడారు.

ఈ అంతర్జాతీయ వేదికపై సాధించిన విజయం గురించి శ్రేణిక్ ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఈ ప్రతిష్ఠాత్మక పతకాన్ని అందుకోవడం జీవితంలో మర్చిపోలేని గర్వకారణమైన క్షణమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశం తరఫున గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా మరింత కష్టపడతానని ధీమా వ్యక్తం చేశారు. తన ఈ క్రీడా ప్రయాణానికి వెన్నుదన్నుగా నిలిచిన అంబేద్కర్ కళాశాల కరస్పాండెంట్ సరోజా వివేక్, సీఈవో ప్రొఫెసర్ లింబాద్రి, డైరెక్టర్ ప్రొఫెసర్ జి. యాదగిరి, ప్రిన్సిపల్ మట్టా శేఖర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎన్. కిరణ్ కుమార్, మరియు తన కోచ్ తిరువీధుల కౌశిక్‌లతో పాటు కుటుంబ సభ్యులకు శ్రేణిక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

hyderabad powerlifter marupaka shrenik wins silver,asia africa pacific powerlifting championship results,shrenik wins silver in south africa.