ఆ రాత్రి మార్పు తెస్తుందా..?
Published on: Mon Nov 26, 2012 3:53PM

సెక్సీ ఫిగర్ శ్రద్ధా దాస్ రూట్ మార్చింది. అందాల్ని ఎంతగా ఆరబోసినా ప్రేక్షకులు తనని గుర్తించలేదన్న బాధని మర్చిపోయి సక్సెస్ ని సాధించేందుకు కొత్త ఫార్ములాని అప్లై చేస్తోంది. రాత్రిలో కొత్త అవతారమెత్తి అందర్నీ భయపెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇంతకీ శ్రద్ధాదాస్ అంతరాత్రివేళ ఏం చేస్తోందో తెలుసుకోవాలంటే పున్నమిరాత్రిని చూసి తీరాల్సిందే..
మళయాళ దర్శకుడు వినయన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా.. తెలుగు, తమిళ భాషల్లో త్రీడీలో రిలీజౌతోంది. కొత్త సినిమాలో శ్రద్ధ తీరుతెన్నుల్ని చూస్తుంటే భయపెట్టడమేమోగానీ అందాల్ని పూర్తిగా ఆరబోసేసి ఆకట్టుకోవడంలో ఈ సారి తప్పనిసరిగా ఛాన్స్ కొట్టేలా కనిపిస్తోంది. శ్రద్ధ ఎన్నో ఆశలు పెట్టుకున్న పున్నమిరాత్రి ఆమెకి వెన్నెల రాత్రిగా మారుతుందా లేక కాళరాత్రిని మిగులుస్తుందా అన్నది మాత్రం సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది మరి.


