TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏబీవీకి జ‌గ‌న్ సర్కార్‌ షోకాజ్‌ నోటీస్‌.. రివేంజ్ యాక్ష‌న్‌!?

Published on: Tue Apr 5, 2022 12:23PM

ఇటీవ‌ల ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు మీడియా ముందుకొచ్చి త‌మ హ‌యాంలో పెగాస‌స్ కొన‌లేదు, వాడ‌లేదంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ ప‌రిణామం జ‌గ‌న్ స‌ర్కారుకు ఊహించ‌ని షాక్‌. అప్ప‌టి వ‌ర‌కూ చంద్ర‌బాబు హ‌యాంలో పెగాస‌స్ కొని, వాడారంటూ అబాంఢాలు వేసే ప‌ని చేసిన వైసీపీ స‌ర్కారు ఏబీవీ ప్రెస్‌మీట్‌తో ఇర‌కాటంలో ప‌డింది. అందుకే, రివేంజ్ యాక్ష‌న్‌తో తాజాగా ముందుకొచ్చింది. 

ఆనాటి మీడియా మీట్‌లో త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని ఏక‌రువు పెట్టారు ఏబీవీ. త‌న రెండేళ్ల‌ స‌స్పెన్ష‌న్ కాలం ముగిసింద‌ని.. త‌న‌కు పూర్తి జీతం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. తానెలాంటి త‌ప్పు చేయ‌లేదని.. త‌న‌పై మోపిన ఛార్జిషీటు సైతం ప‌స లేద‌ని తేల్చి చెప్పారు. త‌న ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. న్యాయం కోసం నిన‌దించారు. 

అంతే. ఏబీవీ చేసిన ఆ ప‌ని.. జ‌గ‌న్ స‌ర్కారుకు రుచించినట్టులేదు. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఆయ‌న‌పై వేటు వేసి రివేంజ్ చ‌ర్య‌లు చేప‌ట్టిన ఏపీ ప్ర‌భుత్వం.. రెండేళ్ల త‌ర్వాత ఇప్పుడిలా ఏబీవీ త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై మీడియా ముందు నోరెత్త‌డంతో ప్ర‌భుత్వ పెద్ద‌లు ఉలిక్కిప‌డిన‌ట్టున్నారు. త‌మ‌నే ప్ర‌శ్నిస్తారా? అనేకున్నారో ఏమో.. వారి ఇగో బాగా హ‌ర్ట్ అయిన‌ట్టుంది. అటు, ఏబీవీ ప్ర‌స్తావించిన అంశాల‌పైనా ప్ర‌జ‌ల్లో చ‌ర్చ మొద‌లైంది. దీంతో.. స‌ర్కారు మ‌ళ్లీ కౌంట‌ర్ యాక్ష‌న్‌కు దిగినట్టు.. ఐబీ మాజీ చీఫ్‌కు షోకాజ్ నోటీసులు ఇష్యూ చేసింది.  

పెగాసస్‌తో పాటు సస్పెన్షన్ అంశాలపై మార్చి 21న ఏబీవీ మీడియాతో మాట్లాడారు. ఈవిషయమై  అభ్యంతరం వ్యక్తం చేస్తూ వివరణ ఇవ్వాలని ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మ షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చారు. ‘‘ఆలిండియా సర్వీస్‌ రూల్స్‌లోని 6వ నిబంధన పాటించకుండా మీడియా సమావేశం పెట్టారు. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా మీడియా సమావేశం పెట్టడం తప్పే. మెమో అందిన వారంలో వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయి’’ అని షోకాజ్‌ నోటీసుల్లో ప్రభుత్వం హెచ్చరించింది.