అహ్మద్ నగర్‌లో ఫుట్‌పాత్‌పై షాపుల తొలగింపు
Published on: Tue Sep 23, 2025 9:35AM

జీహెచ్ఎంసీ అధికారులు నాంపల్లి అహ్మద్ నగర్ లో ఫుట్ పాత్ లను ఆక్రమించి ఉన్న షాపులను తొలగిస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీ అధికారులకు చిరు వ్యాపారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవ్వడంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చేవేతలను సాగిస్తున్నారు.
రోడ్డు విస్తరణలో భాగంగా ఈ కూల్చివేతలను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇలా ఉండగా తమ షాపుల కూల్చివేతకు నిరసనగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామంటూ కొందరు వ్యాపారులు హెచ్చరించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.


