TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మత్తు మందు ఇచ్చి.. విద్యార్థినిపై అత్యాచారం..  

Published on: Wed May 19, 2021 10:02AM

అది గుంటూరు జిల్లా.  పొన్నూరు గ్రామం. ఆ యువతి ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. కరోనా కారణంగా కళాశాల మూతపడడంతో ఏదైనా పనిచేసి కుటుంబానికి ఆసరాగా ఉండాలనుకుంది. అందుకోసం పట్టణంలోని ఓ తినుబండారాల దుకాణంలో పనికి చేరింది. నెలకు రూ.5 వేల జీతం మాట్లాడుకుంది. ఇక అంటే దాన్ని ఆసరా చేసుకున్న యజమాని అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఆ అమ్మాయి పై కన్నేశాడు. అందుకు పథకం వేశాడు. సోమవారం దుకాణంలో ఎవరూ లేని సమయంలో ఆమెకు శీతల పానీయం ఇచ్చాడు. ఆ అమ్మాయి మంచివాడే కదా అని తాగింది. కొద్దీ సేపటికి కళ్ళు తిరిగిపడిపోయింది. ఆ పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఆ పానీయాన్ని తాగిన కొద్దిసేపటికే ఆమె మత్తులోకి జారుకోవడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆనక విషయం అవగతమైన యువతి తల్లిదండ్రులకు చెప్పింది.  అత్యాచారం చేసిన యజమానిపై బాధితురాలి తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి  ఫిర్యాదు మేరకు పొన్నూరు అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.    

అమ్మాయిగా మారిన.. అబ్బాయి మృతి..  

లింగమార్పిడి చేయించుకుని యువతిగా మారిన యువకుడు మరో వ్యక్తితో సహజీవనం చేస్తూ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టరు రవికుమార్‌ కథనం ప్రకారం నల్గొండజిల్లా బుద్దతండాకు చెందిన మహేష్‌(23) మూడు సంవత్సరాల క్రితం లింగమార్పిడి చేయించుకుని అమృతగా మారాడు. గత ఏడాదిగా ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన షేక్‌ జావేద్‌తో సహజీవనం చేస్తోంది. అమృతకు పరిచయస్థుడైన కిషన్‌ మంగళవారం ఆమె ఇంటికి వెళ్లి చూడగా మృతి చెందినట్లు గుర్తించాడు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.