TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దర్జాగా కారులో వచ్చి ఏం చేశారంటే?

Published on: Sat Apr 18, 2026 2:21PM

హైదరాబాద్ లో అర్ధరాత్రి దొంగల దర్జా చోరీ కలకలం రేపింది. ఓ ఇద్దరు వ్యక్తులు కార్లో దర్జాగా దిగారు.  అటు ఇటు చూసి.. నెమ్మదిగా ఓ షాపు వద్దకు వెళ్లి ఇనుపరాడ్ తో షాపు తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళు షాపు మొత్తం గుల్ల చేశారు.  ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.‌  ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  ఇద్దరు దుండగులు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న షాప్ లపై రెక్కీ నిర్వహించారు.

అనంతరం గురువారం (ఏప్రిల్ 17)  అర్ధరాత్రి సమయంలో   మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుగుతూ..  హఫీజ్ పేట్ మార్తండ నగర్ లో హోల్సేల్ సిగరెట్ల షాప్ వద్ద ఆగి,  ఇనుప రాడ్లతో దుకాణం తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి కొంత నగదు, విలువైన సిగరెట్ కార్టన్లు తీసుకొని దర్జాగా మళ్ళీ కారులో  అక్కడి నుండి వెళ్ళిపోయారు. శనివారం (ఏప్రిల్ 18) ఉదయం దుకాణం యజమాని షాప్ వద్దకు వచ్చి  దుకాణం తాళాలు పగలగొట్టి ఉండ డంతో షాక్కు గురయ్యారు.

లోపలికి వెళ్లి చూడగా షాప్ అంతా గందరగోళంగా ఉండడం గమనించిన వెంటనే షాప్ యజమాని పోలీసులకు సమాచారం అందించాడు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని సిసిటీవి ఫుటేజ్ ను ఆధారంగా చేసుకుని దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.