జీవీఎల్‌పైకి షూ విసిరిన డాక్టర్

 

బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావుకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతుండగా... ఆయనపై ఓ వ్యక్తి షూ విసిరాడు. అనూహ్య ఘటనతో జీవీఎల్ షాక్‌కు గురయ్యారు. వెంటనే షూ విసిరిన వ్యక్తిని బీజేపీ కార్యాలయ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. షూ విసిరిన వ్యక్తిని కాన్పూర్‌కు చెందిన వైద్యుడు శక్తి భార్గవ్‌ గా గుర్తించారు. దాడి ఎందుకు చేశారన్నవివరాలు తెలియాల్సి ఉంది.