ఓటుకు నోటు కేసు.. ఎమ్మెల్యే సండ్రకు నిరాశ
Published on: Tue Dec 8, 2020 6:30PM
ఓటుకు నోటు కేసులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు నిరాశ ఎదురైంది. ఓటుకు నోటు కేసు నుంచి తనను తొలగించాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఆ కేసులో సండ్ర దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ నెల 15న సండ్ర వెంకట వీరయ్య కూడా ఏసీబీ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహా గైర్హాజరు కాగా.. ఈనెల 15వ తేదీన జరిగే తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. హాజరు మినహాయింపు కోసం పిటిషన్లను అనుమతించమని కోర్టు స్పష్టం చేసింది.


