TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అనుకున్న దొక్కటి.... అయిందొక్కటి

Published on: Wed Mar 18, 2020 12:55PM

సుప్రీంకోర్టు లో రాష్ట్ర  ప్రభుత్వానికి చుక్కెదురైంది.
ఈసీ నిర్ణయాన్ని సమర్థిస్తూ నిర్ణయం మరియు ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేయాలని ఆదేశాలు. ఎన్నికల వాయిదాని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశం. ఆరు వారాల తర్వాత కూడా పరిస్తితిపై సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం ఈసి కి అప్పగించిన సుప్రీంకోర్టు. దీంతో పాలక వై ఎస్ ఆర్ సీ పీ నిరాశకు గురైంది. 

ఏపీ స్థానిక ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పై  సుప్రీంకోర్టులో విచారణ
విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం, స్థానిక ఎన్నికల వాయిదాను సవాలు చేస్తూ పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం వాదనలు విన్నది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన తెలిసిందే. ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్లో పేర్కొన్న ప్రభుత్వం.

ఏపీ ప్రభుత్వ పిటిషన్ లో ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి . రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కమిషనర్ ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తో సమీక్ష సమావేశం నిర్వహించలేదు. ఎన్నికలకు నిర్వహణ కు సంబంధించి ఇది సుప్రీం తీర్పుకు విరుద్దం. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిదులు అవసరం. ఎన్నికలు జరిగితే కరోనా వైరస్ కట్టడి చర్యలకు మరింత ఊతం. ఈ వ్యవహారం పై చీఫ్ సెక్రటరీ కి, ఎన్నికల కమిషనర్ కు మధ్య లేఖల యుద్ధం కూడా నడిచింది. హైకోర్ట్ ఆదేశం మేరకు జరుగుతున్న ఎన్నికలను వారి సంప్రదించకుండా ఆపడం తగునా, అని కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు నిలిపివేయాల నీ కూడా కోరింది. పంతాని కి పోయినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రంకోర్టు లో చుక్కెదురైంది.