TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. పద్మశ్రీ అందుకున్న మందకృష్ణ

Published on: Tue May 27, 2025 9:32PM

 

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో  పద్మ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై, వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందజేశారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా, తొలి విడతలో నందమూరి బాలకృష్ణ, డాక్టర్ నాగేశ్వర్‌ రెడ్డి వంటి తెలుగు ప్రముఖులతో పాటు మొత్తం 71 మందికి ఏప్రిల్ 28న పురస్కారాలు ప్రదానం చేశారు. తాజాగా జరిగిన రెండో విడత కార్యక్రమంలో మరికొందరు ప్రముఖులు ఈ గౌరవాన్ని అందుకున్నారు.2025 పద్మ అవార్డుల్లో మొత్తం 139 మందికి అవార్డులు అందించారు. 

అందులో 7 మందికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25, 2025న ఈ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటి శోభన పద్మభూషణ్‌ పురస్కారాన్ని స్వీకరించారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పద్మశ్రీ అవార్డును ప్రదానం చేశారు. ఏపీకీ చెందిన వి. రాఘవేంద్రాచార్య పంచముఖి (సాహిత్యం, విద్య), ప్రొఫెసర్‌ కేఎల్‌ కృష్ణ (సాహిత్యం, విద్య) కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. ప్రముఖ కన్నడ నటుడు అనంత్‌ నాగ్‌కు పద్మభూషణ్‌ పురస్కారం లభించింది పద్మభూషణ్‌ అవార్డును కన్నడ నటుడు అనంత్‌ నాగ్‌ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, జైశంకర్‌, కిషన్‌ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రహ్లాద్‌ జోషీ సహా పలువురు హాజరయ్యారు.