సానియామీర్జా..షోయెబ్ అక్తర్ డైవోర్స్?!
Published on: Thu Nov 10, 2022 12:00PM
'స్పోర్ట్స్ ప్రపంచంలో అత్యంత పాపులర్ జంట విడాకులకు సిద్ధమైంది. భారత్ కు చెందిన సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ లు పుష్కర కాలం కిందట వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇప్పుడా జంట విడాకులకు రెడీ అయినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఇండియన్ టెన్నీస్ స్టార్ సానియామీర్జా విడాకులు తీసుకోబోతున్నారా? పాకిస్థాన్ క్రికెటర్ షోయెబ్ అక్తర్ తో ఆమె వైవాహిక జీవితానికి ఎండ్ కార్డ్ పడబోతోందా అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. పరస్పర అంగీకారంతో విడాకుల నిర్ణయానికి వచ్చామని సానియా మీర్జా భర్త షోయేబ్ అక్తర్ చెప్పేశారు. ఈ విషయాన్ని అక్తర్ సన్నిహితుడొకరు మీడియాకు వెల్లడించారు. సానియా, షోయెబ్ అక్తర్ లు ఇప్పటికే విడివిడిగా ఉంటున్నారనీ, విడాకులకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందనీ, అది పూర్తయిన వెంటనే వారిరువురూ తాము విడిపోయిన విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారనీ పాక్ మీడియా సంస్థ పేర్కొంది. సానియా ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. షోయెబ్ అక్తర్ అయితే టి20 ప్రపంచ కప్ అనలిస్ట్ గా పాకిస్థాన్ లోనే ఉన్నాడు. అసలు వీరిద్దరూ విడాకులు తీసుకొంటారన్న వార్తకు ఆధారం ఇటీవల సానియా మీర్జా చేసిన ఒక పోస్టు. సానియా తన కుమారుడు ఇజాన్ బర్త్ డే సందర్భంగా జరిగిన వేడుకల్లో షోయెబ్ ఉన్నప్పటికీ.. సానియా మీర్జా మాత్రం ఆ వేడుకలకు సంబంధించి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన ఫొటోలలో ఎక్కడా షోయెబ్ అక్తర్ కనబడకుండా జాగ్రత్త పడ్డారు. ఇదే వారిరువురి మధ్యా సఖ్యత లేదనడానికి నిదర్శనంగా నెటిజన్లు చెబుతున్నారు. సానియా ఆ పోస్టు పెట్టినప్పటి నుంచీ వీరిరువురూ విడాకులు తీసుకోనున్నారన్న వార్తలు సామాజిక మాధ్యమంలో తెగ కనిపించాయి. ఇప్పుడా వార్తలే వాస్తవమని షోయెబ్ అక్తర్ సన్నిహిత మిత్రుడొకరు ధృవీకరించారు. షోయెబ్ సానియాలు 2010 ఏప్రిల్ 12న హైదరాబాద్ లో వివాహం చేసుకున్న సంగతి విదితమే.


