TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత

Published on: Fri Dec 12, 2025 9:33AM

 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్ శివరాజ్ పాటిల్ (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, మహారాష్ట్రలోని లాతూర్‌లో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులను అలంకరించిన శివరాజ్ పాటిల్, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ  ప్రభుత్వాల్లో రక్షణ, వాణిజ్యం, శాస్త్ర సాంకేతికత, పౌర విమానయానం వంటి పలు కీలక శాఖలకు మంత్రిగా సేవలందించారు. 

2004లో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శివరాజ్ పాటిల్, 2008లో ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడులకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2010 నుంచి 2015 వరకు పంజాబ్ గవర్నర్‌గా, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా ఆయన సేవలందించారు. శివరాజ్ పాటిల్ మరణం దేశానికి, కాంగ్రెస్ పార్టీకి సైతం తీరని లోటు అని రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు.