ముంబైకు కొత్త మేయర్...
Published on: Wed Mar 8, 2017 4:24PM

ముంబయి నగర పాలక సంస్థకు ఇటీవల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో శివసేన పార్టీ మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. తమ పార్టీ తరపున మేయర్ అభ్యర్థిగా విశ్వనాథ్ మహదేశ్వర్‌ను నియమించింది. మేయర్ స్ధానం కోసం బీజేపీ నుండి గట్టి పోటీ ఎదురవుతుందని భావించినా..బీజేపీ మాత్రం తన పార్టీ తరుపున మేయర్ అభ్యర్థిని నిలపడంలేదని, తాము శివసేనకు మద్దతిస్తామని తెలపడంతో శివసేన మేయర్ అభ్యర్థి విశ్వనాథ్‌కు మద్దతిచ్చారు. దీంతో ఆసియాలోని అత్యంత ధనికవంతమైన నగర పాలక సంస్థ బృహణ్‌ముంబయికి కొత్త మేయర్ వచ్చేశాడు.


