TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

దమ్ముంటే అరెస్ట్ చేయండి.. శివసేన ఎంపీపై ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ నిషేదం..

Published on: Fri Mar 24, 2017 11:52AM

 

శివసేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్‌ ఎయిర్ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన సంగతి తెలిసిందే. పుణె నుంచి న్యూఢిల్లీ విమానంలో వెళ్లగా.. ఆయనకు బిజినెస్ క్లాస్‌లో సీటు ఇవ్వలేదని సిబ్బందితో వాగ్వాదానికి దిగి చెప్పుతో కొట్టారు. ఆ తరువాత బయటకు వచ్చిన ఆయన మీడియాతో కూడా ఘాటుగానే వ్యాఖ్యానించారు. ‘అవును, కొట్టాను.. ఒకసారి కాదు 25 సార్లు  చెప్పుతో కొట్టాన‌ు.. ఎయిర్ ఇండియా సిబ్బంది వారి ఇష్టానుసారం మాట్లాడుతుంటే..నేను మారుమాట్లాడకుండా ఉంటానని మీరు అనుకున్నారా?’ అంటూ తిరిగి ఆయనే ప్రశ్నించారు. ఈ సంఘటనపై ఎయిర్‌ ఇండియా ఆయన రిటర్న్ టికెట్‌ను రద్దు చేయడమే గాకుండా తమ విమానాల్లో ఎంపీ ప్రయాణించకుండా నిషేధించింది. ఇదే బాటలో ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ అసోసియేష‌న్ కూడా ఆయనపై నిషేధం విధించింది. ఆయ‌న ఇక ఏ ప్రైవేట్ విమానంలోనూ ఎక్క‌కుండా బ‌హిష్క‌రించింది. నిషేధం ఎంతకాలం కొనసాగుతుందనే విషయమై ఇంకా స్పష్టత లేదని ఎయిర్ ఇండియాకు చెందిన ఓ అధికారి తెలిపారు. అయితే ఇప్పుడు తాజాగా ఏకంగా పోలీసులకే సవాల్ విసిరారు ఎంపీ గారు. దమ్ముంటే ఢిల్లీ పోలీసులు తనను అరెస్ట్ చేయాలని అన్నారు.