వేద్ ప్రతాప్ పై శివసేన ఫైర్

పాకిస్తాన్ పర్యటనలో ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను జర్నలిస్ట్ వేద్ ప్రతాప్ వైదిక్ కలవడంపై శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే మండిపడ్డారు. దేశద్రోహులతో సంబంధం కలిగిన వారు ఎవరైనా దేశంలో వుండడానికి అనర్హులని అన్నారు. ఈ అంశంలో ప్రభుత్వం తన బాధ్యతను కాదనలేదని ఆయన అన్నారు. ఇదే అంశం కాంగ్రెస్ హయాంలో జరిగి ఉంటే బీజేపీ ఎలా స్పందించేదని ఆయన ప్రశ్నించారు. వేద్‌ప్రతాప్, హఫీజ్ సయీద్‌ను కలుసుకున్న అంశం మంగళవారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. హఫీజ్ ను వైదిక్ కలవడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.