TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీకి షాకిచ్చిన శివసేన

Published on: Thu Jun 7, 2018 4:27PM

 

దేశమంతటా పార్టీని బలోపేతం చేయాలన్న ఆశతో మిత్రపక్షాలని దూరం చేసుకున్న బీజేపీ.. రోజురోజుకి ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత చూసి.. ఒకడుగు వెనక్కేసి మళ్ళీ మిత్రపక్షాలకు దగ్గరయ్యే ప్రయత్నం మొదలు పెట్టింది.. దానిలో భాగంగానే బీజేపీ బాస్ అమిత్ షా, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరేని కలిశారు.. 2 గంటలు పైగా చర్చించారు.. దీంతో బీజేపీ, శివసేనల మధ్య మళ్ళీ దోస్తీ మొదలవుతుందని ఆశ పడ్డ బీజేపీకి, శివసేన షాకిచ్చింది.. మీడియాతో మాట్లాడిన శివసేన ప్రతినిథి, ఎంపీ సంజయ్ రావత్.. భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేసారు.. ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది.. ఈ నిర్ణయాన్ని బయటి వ్యక్తులు ప్రభావితం చేయలేరంటూ అమిత్ షాని ఉద్దేశించి ఘాటుగా స్పందించారు...