TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డ్రగ్స్ రైడ్.. హోటల్ నుండి దూకి పారిపోయిన నటుడు

Published on: Thu Apr 17, 2025 5:51PM


 

మలయాళం హీరో షైన్‌ టామ్‌ చాకో మరోసారి వార్తల్లో నిలిచారు. కొచ్చిలోని ఓ హోటల్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో జిల్లా యాంటీ-నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్  బృందం  ఉదయం 11 గంటల సమయంలో రైడ్ చేసింది. అయితే పోలీసులు హోటల్‌కు రావడానికి కొద్దిసేపటి ముందే షైన్ టామ్ చాకో మూడో అంతస్తులో ఉన్న రూం కిటికీ నుండి రెండో అంతస్తులోకి దూకి, అక్కడి నుంచి మెట్ల ద్వారా చాకో పారిపోయినట్లు తెలుస్తోంది. అంతకు ముందు సూత్రవాక్యం అనే సినిమా షూటింగ్ సమయంలో షైన్ టామ్ చాకో డ్రగ్స్ తీసుకొని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని నటి విన్సీ సోనీ అలోషియస్ ఆరోపించింది. 

ఈ నేపథ్యంలో ఆమె సదరు నటుడిపై కేరళ చిత్ర పరిశ్రమలో మరియు అమ్మ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసింది. గతంలో ఓ డ్రగ్స్ కేసు నుంచి నిర్దోషిగా విడుదలైన కొద్ది రోజుల్లోనే డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. దసరా మూవీతో టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. గతేడాది విడుదలైన తెలుగు మూవీ దేవరలోనూ కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్‌ గుడ్ బ్యాడ్‌ అగ్లీ చిత్రంలోనూ కనిపించారు.