శివసేనకు షిండే షాక్!
Published on: Wed Jun 22, 2022 5:59AM
ఏదో కారణంతో అలిగి వెళ్లిన తమ్ముడు తిరిగి వస్తాడు.. సినిమాల్లో. పోనీ అమ్మ తిట్టిందని కోపగించుకుని ఇంటోంచి వెళిపోయిన చిన్నోడు భోజనాలకి తిరిగి రావచ్చు. రాజకీయాల్లో అలిగితే మళ్లీ అదే గూటికి తిరిగి వస్తాడని ఈ రోజుల్లో అయితే గ్యారంటీ లేదు. సడాల్న జంప్ జిలానీ కావచ్చు. ఇపుడు షిండే విష యంలో శివసేన పార్టీకి అదే భయం పట్టుకుంది.
మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీలో తలెత్తిన రాజకీయ సంక్షోభం తీవ్రమవుతున్న సంకేతాలు కనిపి స్తున్నాయి. కొందరు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయి, సూరత్‌లో ప్రచారం సాగిస్తున్న పార్టీ నేత ఏక్‌నాథ్ షిండేపై శివసేన వేటు వేసింది. శాసనసభా పక్ష నేత పదవి నుంచి ఆయనను తొలగిం చింది. ఆయన స్థానంలో శివసేన లెజస్లేటివ్ పార్టీ నేతగా సెవ్రి ఎమ్మెల్యే అజయ్ చౌదరి వ్యవహరించను న్నారు.
తాజా పరిణామాలపై ఏక్‌నాథ్ షిండే తక్షణం స్పందించనప్పటికీ, మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ పరి ణామాలతో తమ పార్టీకి ఎలాంటి ప్రమేయం లేదని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదనతో షిండే ముందుకు వస్తే దానిని బీజేపీ తప్పని సరిగా పరి శీలిస్తుందని చెప్పారు. కానీ ఆయన అలక సామాన్యమయినదా? తాయిలం ఆశ చూపినట్టు షిండేకి బిజెపీ ఆశ చూపితే గతాన్ని క్షణంలో మర్చిపోవడానికి ఆయనేమయినా చిన్నపిల్లాడా? ఆయనకి జరిగిన అవమానం చిన్నదా?
మహారాష్ట్రలో ఒక్కసారిగా తలెత్తిన రాజకీయ సంక్షోభానికి మూల బిందువు అయిన ఏక్‌నాథ్ షిండే పేరు ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన ఎవరన్న ఆరా మొదలైంది. శివసేన అగ్ర నేతల్లో ఒకరైన షిండే ప్రస్తుత మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో పట్టణ వ్యవహారాలశాఖ మంత్రిగా ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని గుజరాత్‌లోని సూరత్‌లో ఓ హోటల్‌లో మకాం వేసిన షిండే ముంబైకి సమీపంలోని థానేకు చెందినవారు. పార్టీని ఇతర ప్రాంతాల్లోనూ బలోపేతం చేయడంలో ఆయన ఎనలేని కృషి చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీకి షిండే వరుసగా నాలుగుసార్లు.. 2004, 2009, 2014, 2019లలో ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన తర్వాత శివసేన లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. పార్టీ నిర్వ హించే ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏక్‌నాథ్ షిండే కీలక పాత్ర పోషించేవారు. ఆయన తనయుడు శ్రీకాంత్ షిండే ఎంపీ కాగా, సోదరుడు ప్రకాష్ షిండే కౌన్సిలర్. ఉద్దేశపూర్వకంగా తనన పక్కన పెట్టడంతో షిండే గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు, పలువురు సేన ఎమ్మెల్యేల నుంచి కూడా ఆయన గట్టి మద్దతు ఉంది.


