షిండే మళ్లీ మాట మార్చాడు

 

తెలంగాణ నోట్‌ విషయంలో షిండే మరోసారి మాట మార్చాడు. గతంలో నోట్‌ రెడీ అయింది అని తానే స్వయంగా అన్న షిండే ఇప్పుడు రెడీ కాలేదు అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన నోట్‌ తయారికి ఇంకా సమయం పడుతుంది అని, ఆ నోట్‌ను కేభినెట్‌ ముందుకు తీసుకొచ్చేప్పుడు మీకు తప్పకుండా చెపుతామని అన్నారు.

రక్షణ మంత్రి ఆంటోని అస్వస్ధత మూలంగా నొట్‌ తయారి ఆలస్యం అవుతుందని, ఆయన కోలుకోగానే నోట్‌ రెడీ చేసి కేభినెట్‌ ముందుకు తీసుకురానున్నారు. దీంతో మంగళవారం జరగబోయే భేటిలో ఇక తెలంగాణ నోట్‌ విషయంలో ఎలాంటి చర్చ జరగదని తేలిపోయింది. ఆంటోని కమిటీ సిఫార్సులు అందిన తరువాత నోట్‌కు తుది రూపునిస్తారని షిండే తెలిపారు.

కేభినేట్‌ భేటి తరువాత ప్రదాని అమెరికా పర్యటన ఉన్నందున ఆయన తిరిగి వచ్చాకే నోట్‌ పై తదుపరి కార్యచరణ కొనసాగనుంది. అక్టోబర్‌ తొలి వారంలో జరగభోయే భేటి సమయానికి నోట్‌ రెడీ చేస్తామని హోం శాఖ వర్గాలు చేపుతున్నా ప్రస్థుతం రాష్ట్రం ఉన్న పరిస్ధితుల్లో అసలు కేంద్ర ముందడుగు వేసే ఆలోచనలో ఉందా అనేది కూడా సందేహమే.