కామన్వెల్త్ స్కామ్ : శిల్పాశెట్టికి 71 లక్షలు

 

 Shilpa Shetty, Commonwealth Games Scam, CBI court frames charges against Kalmadi

 

 

కామన్ వెల్త్ స్కామ్ ఇంకా మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ గేమ్స్ ముగిసి రెండేళ్లు గడిచిపోయినా… ఈ స్కామ్ సూత్రధారులు, లబ్ధిదారుల లిస్టు ఇంకా పెరుగుతూనే ఉంది. కామన్ వెల్త్ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి శిల్పకు కేవలం అఫిషియల్ గానే కాకుండా, అనఫిషియల్ గా కూడా సొమ్ము చెల్లింపులు జరిగాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ కోర్టు బయటపెట్టింది. మరి గేమ్స్ కు సంబంధించిన కార్యక్రమాల్లోడాన్సులూ గట్రా చేసినందుకు శిల్పకు అఫిషియల్ గా సొమ్ములు అందజేయగా… స్కామ్ లో భాగస్వామ్యులపైన ఇద్దరు నిందితులు ఆమెకు 71 లక్షల రూపాయలు చెల్లించారని కోర్టు తెలిపింది. మరి ఈ అనధికార చెల్లింపు ఎందుకు జరిగాయో తేలాల్సి ఉంది!

 

కామన్‌వెల్త్‌ క్రీడల(సీడబ్ల్యూజీ) నిర్వహణ కమిటీ బహిష్కృత అధ్యక్షుడు సురేశ్‌ కల్మాడీ, మరో 9 మందిపై కోర్టులో విచారణకు రంగం సిద్ధమైంది. కామన్‌వెల్త్‌ క్రీడల నిర్వహణలో వీరు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో గరిష్ఠంగా జీవితఖైదు శిక్షపడే అవకాశం గల కుట్ర, దొంగ సంతకం తదితర ఆరోపణలపై ఢిల్లీ కోర్టు సోమవారం కల్మాడీ, ఒలింపిక్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి లలిత్‌ భానోత్‌ సహా 9 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేసింది.