యూపీ ఎన్నికలు.. కాంగ్రెస్ అప్పుడే స్టార్ట్ చేసేసింది..

 

యూపీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలుపు సాధించడంకోసం అన్ని పార్టీల నేతలు ఎవరి ప్లానింగ్స్ లో వాళ్లు ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి అధికారం చేపట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే ఎన్నికలకు సంబంధించి అప్పుడే ప్రచారానికి శ్రీకారం చుట్టింది. యూపీ సీఎం అభ్యర్దిగా ఎన్నికల బరిలో దిగుతున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఈరోజు ఢిల్లీ నుండి యూపీకి బయలుదేరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ జెండా ఊపి లాంఛనంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారం మూడు రోజుల పాటు జరగనుంది.

 

కాగా ముందు యూపీ ఎన్నికల బరిలో రాహుల్ గాంధీని దించాలనుకున్నారు. కానీ అందుకు సొంత పార్టీ నేతలే అభ్యంతరం చెప్పడంతో ప్రియాంక గాంధీని రంగంలోకి దించాలనుకున్నారు. ప్రియాంక గాంధీ అయితే యూపీలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆమె పేరునే దాదాపు ఖరారు చేసింది పార్టీ హైకమాండ్. అయితే ఏమైందో తెలియదు కానీ ఆఖరి నిమిషంలో సోనియా షీలా దీక్షిత్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. మొదట దీనికి కూడా అభ్యంతరాలు ఎదురైనా.. యూపీలో గెలవాలంటే షీలా దీక్షిత్ అయితేనే కరెక్ట్ అని.. అందునా ఆమె బ్రాహ్మణ సామాజికి వర్గానికి చెందిన ఆమె కూడా కాబట్టి.. గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుందని ఆమెనే ఎన్నికల బరిలోకి దింపారు.