షర్మిల రాజకీయ శక్తిగా ఎదుగుతుందా ?
Published on: Fri Oct 12, 2012 5:57PM

చంద్రబాబునాయుడుకు జనంలో వస్తున్న స్పందనని చూసి గాభరా పడ్డ వైయస్సార్ కాంగ్రెస్ నేతలు తాము కూడా ప్రజలమద్యకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఈనెల 18నుండి మరో మహాప్రస్థానం పేరుతో 3000 కిలోమీటర్లకు రోడ్ మ్యాప్ తయారు చేసి, వైయస్సార్ కుమార్తె షర్మిళను రంగంలోకి దించారు. అయితే ఈ ప్రజాప్రస్దానం సుమారు సంవత్సరం వరకు జరుగుతుంది. దాంతో వైసిపి పార్టీలో ఉన్న నాయకులకు, ప్రజలకు, పార్టీ శ్రేణులకందరికీ షర్మిల మాత్రమే ప్రథాన నేతగా పార్టీ తరఫున దగ్గరవుతుంది. అదృష్టం బాగుండి జగన్ జైల్లోంచి బైటపడ్తే తను కూడా యాత్రలో పాల్గొంటాడని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. కానీ.. జగన్ విడుదల ఆలస్యమైతే మాత్రం ప్రజల్లో జగన్ తో పోలిస్తే షర్మిలకే ప్రాథాన్యం ఎక్కువగా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


