TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ పై షర్మిల మరోసారి మాటల దాడి

Published on: Sat Jul 27, 2024 1:00PM

ఎపిసిసి అధ్యక్షురాలు  షర్మిల... రాజకీయాలపై విమర్శల జోరు కూడా తగ్గించారు. కానీ ఇవాళ ఉన్నట్లుండి తిరిగి జగన్ పై మాటల దాడి ప్రారంభించారు.దేశరాజధానిలో తన ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు సంఘీభావం ప్రకటించలేదన్న మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా? విభజన హక్కులు, ప్రత్యేక హోదాను గాలికి వదిలేసినందుకా? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి సంఘీభావం వచ్చిందా? మీ నిరసనలో నిజం లేదని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది’’ అని షర్మిల తెలిపారు.