TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రామోజీరావుకు షర్మిల నివాళి!

Published on: Wed Jun 19, 2024 2:40PM

ఇటీవల మరణించిన ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు, రామోజీ గ్రూపు ఛైర్మన్ రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నివాళులు అర్పించారు. రామోజీ ఫిలింసిటీలోని రామోజీరావు నివాసానికి బుధవారం నాడు షర్మిల వెళ్ళారు. రామోజీరావు చిత్రపటం వద్ల ఈ సందర్భంగా షర్మిల పుష్పాలు వుంచి అంజలి ఘటించారు. అనంతరం రామోజీరావు సతీమణి రమాదేవి, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబసభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.