Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శక్తిమాన్ హీరో నీచ వ్యాఖ్యలు
posted on: Aug 11, 2022 7:23AM
ఏదో కొంచం గుర్తింపు రాగానే తామేం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుందనుకునే వారు ఉంటారు. అందులోనూ సాంప్రదాయం, నాగరికత, కట్టు బాట్లు, హిందూ ధర్మం అంటూ ఇష్టారీతిన మాట్లాడితే తిరుగే ఉండదన్న భావనలో ఉంటారు. సంప్రదాయం అంటూ మహిళలను కించ పరిచే వ్యాఖ్యలు చేసి ఏదో హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికే తాము అలా మాట్లాడుతున్నామని విర్రవీగుతుంటారు.
అదిగో సరిగ్గా అలాంటి కోవలోకే చేరుతాడు శక్తిమాన్ హీరో ముఖేష్ ఖన్నా. దూరదర్శన్ లో వచ్చిన శక్తిమాన్ సీరియల్ తో ప్రాచుర్యం పొంది బాలీవుడ్ అవకాశాలను అందిపుచ్చుకున్న ఈ నటుడు మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ‘మహాభారత్’ సీరియల్ లో భీష్మ పాత్రలో నటించిన ముఖేష్ ఖన్నా ఆడవారు ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి అంటూ నీతిబోధలు చేయడానికి ప్రయత్నించి అభాసుపాలయ్యారు.
ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే శృంగారం కోరే మహిళలు వేశ్యలతో సమానమని అన్నారు. పురుషులు మహిళల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. నాగరిక సమాజంలో సంప్రదాయబద్ధంగా ఉండే మహిళలెవరూ శృంగారం గురించి మాట్లాడరన్నారు. అలా మాట్లాడే వారు తన దృష్టిలో వేశ్యలతో సమానమని పేర్కొన్నారు. బీష్మ ఇంటర్నేషనల్ పేరిట తాను నడుపుతున్న యూట్యూబ్ చానెల్ లో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో సెక్స్ మోసాల గురించి యువతను హెచ్చరించడంలో భాగంగానే తానా వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చుకోవడానికి ప్రయత్నించారు. మహిళల గురించి అనుచితంగా మాట్లాడిన ముకేశ్‌ఖన్నాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ మహిళా కమిషన్ సైబర్ సెల్ పోలీసులకు నోటీసు పంపింది.






