నా ఆరోగ్యం బానేఉంది.. ఆందోళన వద్దు.. శరద్ పవార్
Published on: Wed Jan 27, 2016 9:20AM

నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అస్వస్థతకు గురైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు కూడా పుకార్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలపై స్పందించిన శరద్ పవార్ తన ఆరోగ్యం మెరుగైందని.. ఎటువంటి ఆందోళన చెందవద్దని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
కాగా శరద్ పవార్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు పుణెలోని రూబి ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆయన శరీరంలో ఫ్లూయిడ్స్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు సంభవించాయని.. ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు.


