TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ సీఎస్ గా శాంతి కుమారి

Published on: Wed Jan 11, 2023 3:05PM

తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి నియమితులయ్యారు. ఈ పదవిలో ఆమె   2025 వరకు ప  కొనసాగనున్నారు. శాంతికుమారి ప్రస్తుతం  అటవీశాఖ స్పెషల్‌ సీఎస్‌గా పనిచేస్తున్నారు.  గ‌తంలో వైద్యారోగ్య శాఖ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించారు. సీఎంవోలో స్పెష‌ల్ ఛేజింగ్ సెల్ బాధ్య‌త‌ల‌ను కూడా నిర్వ‌హించారు.   మెద‌క్ క‌లెక్ట‌ర్‌గా కూడా శాంతి కుమారి సేవ‌లందించారు.

హైకోర్టు తీర్పుతో సోమేష్ కుమార్ తెలంగాణ సీఎస్ గా రిలీవ్ అయిన క్షణం నుంచీ రాష్ట్రంలో కొత్త సీఎస్ ఎవరన్న ఉత్కంఠ నెలకొంది.  ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐఎస్ఎస్ అధికారులు రామకృష్ణ, అరవింద్ కుమార్ లలో ఎవరు తెలంగాణ కాబోయే సీఎస్ అన్న చర్చ అధికార వర్గాలలో జోరుగా సాగింది.  మునిసిపల్ శాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న అరవింద్ కుమార్, ప్రణాళికా శాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న రామకృష్ణలు రేసులో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. వీరిరువురిలో కూడా బీహార్ కు చెందిన అరవింద్ కుమార్ కే ఎక్కువ అవకాశాలున్నట్లుగా అధికార వర్గాలు సైతం భావించాయి. మునిసిపల్ శాఖ స్పెషల్ సీఎస్ గా అరవింద్ కుమార్ మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గుడ్ సెల్వ్స్ లో ఉన్నారన్న ప్రచారంతో తెలంగాణ స్పెషల్ సీఎస్ గా ఆయనకే ఎక్కువ అవకాశాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే కేసీఆర్ కూడా బీహార్ క్యాడర్ కు చెందిన అరవింద్ కుమార్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. సీనియారిటీ ప్రకారం రామకృష్ణారావు ముందు వరుసలో ఉన్నప్పటికీ.. కేసీఆర్ మొగ్గు మాత్రం అరవింద్ కుమార్ వైపే ఉందని భావించారు.

అయితే అనూహ్యంగా  అటవీశాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న శాంతి కుమారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేశారు. ఆమెను కొత్త సీఎస్ గా నియమించారు. శాంతికుమారి  1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి శాంతి కుమారి.. గ‌తంలో ఆమె సీఎం కార్యాల‌యంలో ప‌ని చేశారు. శాంతి కుమారి తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్ గా రికార్డు సృష్టించారు.

 తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా నియమితురాలైన శాంతి కుమారి ప్రగతి భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. మెరైన్ బయోలజీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న శాంతి కుమారి అమెరికాలో ఎంబీఏ చేశారు. ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఆ తరువాత తెలంగాణలోనూ వివిధ హోదాలలో పని చేసిన శాంతి కుమారి  తెలంగాణ సీఎస్ గా నియమితురాలయ్యే వరకూ తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు.