మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలి :మంత్రి శంకరరావు
Published on: Tue Jan 17, 2012 6:50PM
హైదరాబాద్:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సహా రాష్ట్ర మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని జౌళిశాఖ మంత్రి శంకరరావు అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన నివాసంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నేతలతో భేటీ అయ్యారు. అతిత్వరలో తమతోపాటు మంత్రి వర్గంలో పూర్తిస్థాయి మార్పులు ఉండవచ్చునని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలను దూరం చేసుకోవద్దని సోనియాకు లేఖ రాస్తానని శంకర్రావు ఆయా సంఘాల నేతలతో చెప్పారు. తమపై దాడి జరిగి ఇన్ని రోజులైనా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై శంకరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. గాలి జనార్ధన్‌రెడ్డి, జగన్ లాంటి అక్రమార్కులపైన రాజీలేని పోరాటం చేస్తున్నానని, తమపైనే దాడులు జరిగినా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని మంత్రి పేర్కొన్నారు.


