పోయిరా పొన్నాలా... శంకర్రావు...
Published on: Tue Sep 23, 2014 5:12PM

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అర్జెంటుగా తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఎక్కువైపోయాయి. మొన్నటి వరకూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నాల మీద విరుచుకుపడ్డారు. పొన్నాల రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఇప్పుడు ఆయన కొంచెం చల్లబడినట్టున్నారు. ఆ బాధ్యతని ఇప్పుడు మాజీ మంత్రి శంకర్రావు తీసుకున్నట్టున్నారు. పొన్నాల అర్జెంటుగా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మెదక్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆ బాధ్యత తాను తీసుకుంటానని పొన్నాల అన్నారని, అంచేత పొన్నాల పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని శంకర్రావు డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యుల మధ్యనే సమన్వయం లేదని, ఇక వీళ్ళు పార్టీలో సమన్వయం ఎలా తెస్తారని శంకర్రావు ప్రశ్నించారు. పొన్నాల పదవిని పీకేసి తెలంగాణ పీసీసీ అధ్యక్ష పీఠం మీద సమర్థుడిని కూర్చోబెట్టాలని సోనియాగాంధీకి లేఖ రాశానని శంకర్రావు వెల్లడించారు.


