తాను గాంధీ కుటుంబానికి వాచ్ డాగ్ ని '
Published on: Mon Dec 26, 2011 1:48PM
హైదరాబాద్:
చేనేత హైదరాబాద్: చేనేత శాఖ మంత్రి శంకర్రావు మరోసారి తనదైన శైలిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శంకర్రావు నేలపై కూర్చోని మీడియాతో మాట్లాడారు. తనపై దాడి చేసింది హోమంత్రి సబితా ఇంద్రా రెడ్డి అనుచరులేనని తనపై దాడి చేసిన కేసులో సంబంధంలేని వారిని విచారిస్తున్నారని ఆయన అధికారులపై మండిపడ్డారు.అమాయకులను విచారిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకు న్యాయం చేస్తారన్న నమ్మకముందన్నారు. అధిష్టానం అన్ని విషయాలను గమనిస్తోందని చెప్పారు. నాపై దాడి చేసింది హోంమంత్రి అనుచరులేనని న్యాయం జరగకుంటే హెచ్చార్సీని ఆశ్రయిస్తానన్నారు. తాము మంత్రులుగా ఎంతకాలం ఉంటామో తెలియదని, మంత్రివర్గ మార్పులు చేర్పుల్లో పదవులు పోవచ్చునని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అసలు నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాను గాంధీ కుటుంబానికి వాచ్ డాగ్నని, తనను కుక్కతో పోల్చినా ఇబ్బంది లేదన్నారు.


