TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రతికూల వాతావరణం...శంషాబాద్‌కు రావాల్సిన 2 విమానాలు డైవర్ట్

Published on: Thu May 14, 2026 10:21AM

 

హైదరాబాద్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన రెండు విమానాలను దారి మళ్లించారు. పుణె నుంచి రావాల్సిన ఇండిగో విమానం విజయవాడకు, దుబాయ్ నుంచి రావాల్సిన ఎమిరేట్స్ విమానం బెంగుళూరుకు వెళ్లాయి.నగర శివారు పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై, ల్యాండింగ్‌కు విజిబిలిటీ తక్కువగా ఉండటంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. వాతావరణం సద్దుమణిగిన తర్వాత, ఆ రెండు విమానాలు తిరిగి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. దీంతో ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.