‘షమితాబ్’ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ

 

తమిళ హీరో ధనుష్ తన తొలి హిందీ సినిమా ‘రాంఝానా’ ద్వారా హిట్టు కొట్టాడు. ఇప్పుడు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్‌ బచ్చన్‌తో కలసి నటించిన ‘షమితాబ్’ సినిమా శుక్రవారం నాడు విడుదలైంది. కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ ఈ సినిమాలో కథానాయిక. ఆర్.బాల్కి ఈ సినిమా దర్శకుడు. ఈ సినిమా కథలోకి వస్తే, సినిమా హీరో అవుదామని ముంబైకి వెళ్ళిన ధనుష్‌కి అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అక్షర హాసన్ పరిచయమవుతుంది. అయితే పీలగా వుండే గొంతుతో వుండే ధనుష్‌కి అమితాబ్ డబ్బింగ్ చెబితే బాగుంటుందని అక్షర హాసన్ సూచిస్తుంది. ఈ మేరకు అమితాబ్‌ తనకు డబ్బింగ్ చెప్పే విధంగా ధనుష్‌కి, అమితాబ్‌కి ఒప్పందం కుదురుతుంది. అమితాబ్ డబ్బింగ్ పుణ్యమా అని ధనుష్ స్టార్ అవుతాడు. అయితే ఆ తర్వాత ధనుష్, అమితాబ్ మధ్య అభిప్రాయ భేదాలు, ఇగో ప్రాబ్లమ్స్ తలెత్తడంతో అమితాబ్ ధనుష్‌కి డబ్బింగ్ చెప్పనని అంటాడు. ఇద్దరికీ గొడవ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ‘షమితాబ్’ కథాంశం. అమితాబ్ బచ్చన్, ధనుష్ నటన ఇరగదీశారు. అక్షర హాసన్ ముద్దు ముద్దుగా కనిపించింది. విషయం వున్న పిల్లే అనిపించింది. మొత్తమ్మీద చూడదగ్గ సినిమా ’షమితాబ్’