యాపిల్ బ్రాండ్ అంబాసిడర్‌గా షారుఖ్..!
Published on: Fri Jun 3, 2016 2:53PM

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ను యాపిల్ భారత రాయబారిగా నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది యాపిల్ సంస్థ కొత్త మోడళ్లను విడుదల చేయనున్న నేపథ్యంలో షారుఖ్ ను భారత రాయబారిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంతేకాదు.. భారత పర్యటనకు వచ్చిన యాపిల్ సంస్థ సీఈవో టీమ్ కుక్.. షారుఖ్ ఇచ్చిన డిన్నర్ పార్టీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పుడే దీనిపై చర్చించినట్టు తెలుస్తోంది. కాగా ప్రముఖ బ్రెజీలియన్ సాకర్ క్రీడాకారుడు నేమార్, అమెరికాకు చెందిన బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు స్టీఫ్ కర్రీ ఇలా చాలా మంది యాపిల్‌కి రాయబారులుగా నియమితులయ్యారు.


