కుటుంబ సభ్యులను కోల్పోయింది.. అయినా..!
Published on: Wed Oct 9, 2024 12:04PM

ఉగ్రవాదుల కారణంగా ఎంతో నష్టపోయిన షగున్ పరిహార్ అనే యువతి తాజాగా జరిగిన జమ్మూ కాశ్మీర్ ఎన్నికలలో ఘన విజయం సాధించారు. షగున్ పరిహార్ బీజేపీ తరఫున కాశ్మీర్‌లో ఎన్నికలలో పోటీ చేసిన ఏకైక మహిళా అభ్యర్థి. ఆమె కిష్టవార్ అసెంబ్లీ స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్‌అభ్యర్థి, మాజీ మంత్రి సజాద్ అహ్మద్ కిచ్లూపై 521 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఉన్నత విద్యావంతురాలైన షగున్ పరిహార్ ఉగ్రవాదుల బాధితురాలు. 2018 నవంబర్‌లో ఉగ్రవాదుల దాడిలో షగున్ పరిహార్ తండ్రి అజిత్ పరిహార్, చిన్నాన్న అనిల్ పరిహార్ ప్రాణాలు కోల్పోయారు. ఆ బాధను పంటి బిగువున భరిస్తూ ఎన్నికలలో పోటీ చేసిన షగున్ పరిహార్ విజయం సాధించారు.


