TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శాంతి ఒప్పందం సరే.. ట్రంప్ మెలిక సంగతేంటి?

Published on: Mon Jun 15, 2026 9:47AM

పశ్చిమ ఆసియా  ఉద్రిక్తతలకు తెరదించుతూ.. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఇ ఈ నెల జూన్ 19న స్విట్జర్లాండ్‌లో ఈ ఒప్పందంపై ఇరు దేశాల ఉన్నతాధికార ప్రతినిధులు  సంతకాలు చేయనున్నారు. ఈ చారిత్రక ఒప్పందం ఖరారైన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక  ట్రూత్ సోషల్' ద్వారా  చేసిన కీలక ప్రకటనలో  అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఉన్న నౌకాదళ ఆంక్షలను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.  ఈ ఒప్పందం ప్రకారం లెబనాన్‌తో సహా అన్ని సరిహద్దు ప్రాంతాల్లో తక్షణ కాల్పుల విరమణ అమలులోకి రానుంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.

అయితే అంతా బ్రహ్మాండంగా  సాగుతోందని అంతా భావిస్తున్న తరుణంలో అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్  పెట్టిన మెలిక శాంతి ఒప్పందంపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ట్రంప్ మెలిక కారణంగా  ఇరాన్‌కు  విడుదలపై  ప్రతిష్టంభన ఏర్పడింది. అమెరికా   ఆంక్షల కారణంగా వివిధ అంతర్జాతీయ బ్యాంకుల్లో ఇరాన్‌కు చెందిన 12 బిలియన్ డాలర్ల నిధులు నిలిచిపోయాయి. భారతీయ కరెన్సీలో దీని విలువ దాదాపు  లక్ష కోట్ల రూపాయలు. జూన్ 19న జరిగే అధికారిక సంతకాల కంటే ముందే ఈ రూ. లక్ష కోట్ల నిధులను పూర్తిగా విడుదల చేయాలని ఇప్పుడు ఇరాన్  డిమాండ్ చేస్తోంది. ఆ నిధులు ఇస్తేనే ఒప్పందం ముందుకు సాగుతుందని కుండబద్దలు కొట్టింది. 

అయితే  డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ డిమాండ్ ను  తోసిపుచ్చారు. శాంతి ఒప్పందంలోని కఠిన నిబంధనలను ఇరాన్ క్షేత్రస్థాయిలో ఏ మేరకు అమలు చేస్తుందో పరిశీలించి, ఇరాన్ ప్రవర్తన, పనితీరు ఆధారంగా  మానవతా దృక్పథంతో విడతల వారీగా ఆ నిధులను విడుదల చేస్తామని తేల్చి చెప్పారు. ఒకవేళ ఇరాన్ క అణు ఒప్పంద నిబంధనలను ఉల్లంఘిస్తే మళ్లీ సైనిక దాడులు తప్పవంటూ హెచ్చరించారు. దీంతో శాంతి ఒప్పందం ముదుకు సాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.