TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సెజ్ భూములను అమ్మేస్తున్న పారిశ్రామికవేత్తలు

Published on: Tue Apr 3, 2012 9:15AM

కాకినాడ ప్రాంతంలో ప్రత్యేక ఆర్థికమండలి కోసం రైతులనుంచి సేకరించిన భూములను సెజ్ నిర్వాహకులు దుర్వినియోగం చేస్తున్నారు. సెజ్ పేరుతొ వేలాది ఎకరాల భూమిని రైతులనుంచి అతి తక్కువ రేటుకు సేకరించారు. 2005 ప్రత్యేక ఆర్థికమండలి చట్టం ప్రకారం సెజ్ కోసం సేకరించిన భూమిని అమ్మే హక్కు ఎవరికీ లేదు. కానీ ఈ సెజ్ లో పరిశ్రమలు నెలకొల్పు తామంటూ ముందుకొచ్చిన కొందరు బోగస్ పారిశ్రామికవేత్తలు మొదట ఈ భూములను తమ పేర బదలాయించుకొంటున్నారు. తరువాత ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి బదులు ఆ బూములను చిన్న చిన్న పారిశ్రామిక వేత్తలకు, వ్యాపారవేత్తలకు ఇష్టం వచ్చినట్లు విక్రయిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు.

ఈ సెజ్ భూములను ఎవరు తీసుకున్నారో వారే ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలి. వారికి ఇతరులకు లీజ్ కు ఇచ్చే హక్కు కూడా ఉండదు. కాని ఇక్కడ మాత్రం అన్ని నిబంధనలకు విరుద్ధంగానే జరుగుతున్నాయి. కొంతమంది వ్యక్తులకు సెజ్ ల్లో భూములు సేకరించి విక్రయించుకోవడం, లీజ్ కి ఇవ్వడం పెద్ద వ్యాపారంగా మారింది. దీంతో సెజ్ ల లక్ష్యం నెరవేరడం లేదు. పేద రైతులు మాత్రం తమకున్న కొద్దిపాటి భూములను కోల్పోయి నానా యాతనలు పడుతున్నారు.