లైంగిక వివాదం కేసులో మరో తెలంగాణ నేత..!!
Published on: Mon Aug 6, 2018 10:52AM
మదర్ ఫౌండేషన్ ప్రతినిధిగా పనిచేస్తున్న విజయలక్ష్మి అనే ఆమె, తనను మోసం చేశాడంటూ.. కాంగ్రెస్ నేత, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై ఆరోపణలు చేసారు.. విజయలక్ష్మి మాట్లాడుతూ, తాను స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో గండ్ర వెంకటరమణారెడ్డితో పరిచయం ఏర్పడి, అది చనువుగా మారిందని చెప్పారు.

గత ఐదేళ్లుగా ఇద్దరికీ శారీరక సంభందం ఉందని.. 4 రోజుల క్రితం వరకు కూడా తనతో చనువుగా ఉన్నాడని తెలిపారు.. తాను ఈ నెల 3వ తేదీ రాత్రి ఆయనను కలిసేందుకు జీఎంఆర్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లానని.. కానీ, ఆయన పోలీసులకు సమాచారమిచ్చి అరెస్టు చేయించారని ఆరోపించారు.. కాగా ధర్నా చేస్తున్న విజయలక్ష్మిని పోలీసులు సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.. అనంతరం ఆమె ఫిర్యాదు మేరకు గండ్రపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.. అయితే ఈ విషయంపై స్పందించిన గండ్ర.. అధికార పార్టీకి చెందిన నేతలు ఆమెకు అన్నిరకాలా మద్దతు తెలుపుతూ నీచపు ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు.. రాజకీయంగా ప్రజల్లో తనకున్న ఆదరాభిమానాలను చూసి ఓర్వలేక, తనను నేరుగా ఎదుర్కోలేక ప్రత్యర్థులు చివరికి ఓ మహిళతో లైంగిక ఆరోపణలు చేయించడం దురదృష్టకరమని అన్నారు.


