మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో మరో నిందితుడు అరెస్ట్..!
Published on: Wed Aug 26, 2026 8:54PM

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మవారి దేవాలయంలో మైనర్ బాలికపై ఒక వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు వృద్ధుడైన సాయన్నను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుండగా.. తాజాగా వెలుగులోకి వచ్చిన వ్యవహారం నేపథ్యంలో మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రాపురం ప్రాంతంలో ఉన్న ఓ ఆలయానికి బయట నుంచి తాళం వేసి లోపల ఒక వృద్ధుడు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడుతుండగా స్థానికులు గమనించి వెంటనే అతని పట్టుకున్నారు. ఆ వృద్ధుడు ఆ సాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న దృశ్యాలను స్థానికులు వీడియోగా రికార్డు చేశారు.
ఆలయంలో అర్చకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సాయన్న @ సాయిలు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడడంతో స్థానికులు వెంటనే అతని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సాయన్న ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈకేసులో వృద్ధుడు సాయన్న, రవి అనే ఇద్దరు నిందితులకు మైనర్ బాలికతో గతంలోనే పరిచయం ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 13 ఫిబ్రవరి 2025న బాలికను యాదగిరిగుట్టకు తీసుకెళ్లిన ఘటనకు సంబంధించిన అంశాలు కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో పోలీసులు ఇద్దరు నిందితులపై క్రైమ్ నంబర్ 505/2026*లో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్లతో పాటు **POCSO Act-2012, **SC/ST (POA) Amendment Act-2015* కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా బిల్లె రవి(46)ని ఈరోజు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.మైనర్ బాలికకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
Sexual assault on a minor girl, POCSO Act, BNS, Cyberabad Police, Sayanna, CP Sajjanar, DGP C.V. Anand, CM Revanth reddy


