ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు
Published on: Mon Jan 31, 2022 11:37AM
ఏపీ హైకోర్టుకు ఏడుగురు న్యాయవాదులను సుప్రీంకోర్టు కొలీజియం జడ్జీలుగా ప్రమోట్ చేస్తూ సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టులోనే న్యాయవాదులుగా పనిచేస్తున్న వీరిని అదే కోర్టుకు జడ్జీలుగా నియమించింది. వారిలో 1) చీమలపాటి రవి, 2) వడ్డిబోయిన సుజాత, 3) కొనకండి శ్రీనివాసరెడ్డి, 4) గన్నమనేని రామకృష్ణప్రసాద్, 5) నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, 6) సత్తి సుబ్బారెడ్డి, 7) తర్లాడ రాజశేఖరరావు ఉన్నారు. ఈ నెల 29న సుప్రీం కోర్టు కొలీజియం సమావేశమై తాజా నియామకాలను ఖరారు చేసింది. వీరి నియామకంతో కేసులు మరింత తొందరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
.webp)


